Site icon NTV Telugu

Rashmika- Devarakonda: ఎవ‌రైనా అడిగితే నీపేరే చెబుతా..

Rashmika, Devarakonda

Rashmika, Devarakonda

లైగర్ ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ నేతృత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ద‌మైంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్‌ దేవరకొండకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఆ పోస్ట‌ర్ లో విజయ్‌ నగ్నంగా కనించ‌డం.. శరీరంపై నూలు పోగు లేకుండా ఒక‌ పుష్పగుచ్చం అడ్డుపెట్టుకొని ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుండ‌టంతో.. దీనిపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.

Jammu Kashmir: టెర్రరిస్టులను పట్టించిన కాశ్మీర్ గ్రామస్తులు.. సర్వత్రా ప్రశంసలు

అయితే.. తాజాగా ఈ పోస్టర్‌పై నేషనల్‌ క్రష్‌ రష్మిక స్పందించింది. విజ‌య్ నగ్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఇప్పటివరకు నన్ను ఎవరైనా నీకు స్ఫూర్తి ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెప్పాలో అర్థమయ్యేది కాదని, కానీ.. ఇకపై ఎవరైన ఆ ప్రశ్న అడిగితే మాత్రం నీ పేరే సమాధానంగా చెబుతాను అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు.. లైగర్‌ నీకు మా ప్రేమ.. మా మద్దతు ఉంది.. నువ్వు ఏం చేయగలవో ప్రపంచానికి చూపించంటూ ట్విట‌ర్ వేదిక‌గా రష్మిక రాసుకొచ్చింది. అయితే.. రష్మిక కామెంట్‌కి రౌడీ హీరో కూడా రిప్లై ఇచ్చాడు. రుషీ , గీతగోవిందం నుంచి నువ్వే నా స్ఫూర్తి లైగర్‌ ఈ ప్రంచానికి మెరుపులు అందిస్తుందని నేను మాట ఇస్తున్నానంటూ విజయ్‌ రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం విజయ్‌, రష్మికల పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Exit mobile version