Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం
- మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు
- కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం
- కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది: రష్మీ దేశాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ టీవీ నటి రష్మీ దేశాయ్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని రష్మీ దేశాయ్ వెల్లడించింది. ఈ సంఘటన జరిగినప్పుడు, తన వయస్సు కేవలం 16 సంవత్సరాలని ఆమె పేర్కొంది. ‘దురదృష్టవశాత్తూ నేను ఇలాంటి అనుభవాన్ని అనుభవించాల్సి వచ్చింది, దాని గురించి చాలాసార్లు బహిరంగంగా మాట్లాడా’ అని ఆమె చెప్పింది. తాజాగా రష్మీ దేశాయ్ మాట్లాడుతూ ఒకరోజు నన్ను ఆడిషన్‌కి పిలిచినట్లు గుర్తు, నేను చాలా ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నాను, కానీ అక్కడ ఒక వ్యక్తి తప్ప ఎవరూ లేరు. అక్కడ కెమెరా కూడా లేదు. నా డ్రింక్‌లో డ్రగ్స్ వేసి నన్ను అపస్మారక స్థితికి తీసుకువెళ్లి అనుభవించాలని తన శాయశక్తులా ప్రయత్నించాడు.
Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌పై కొడుకు దాడి
Also Read
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
- Legacy: విశ్వక్ సేన్ 'లెగసీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ 'కామ్రేడ్ కళ్యాణ్'!
- Sardar 2: 'స్పైడర్'లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
ఇదంతా వద్దు అని చెప్పా, ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ఇంటికి వచ్చి అమ్మతో అంతా చెప్పాను. ‘మరుసటి రోజు, నేను ఆ వ్యక్తిని కలవడానికి మా అమ్మతో కలిసి వెళ్ళా, అతనికి గుణపాఠం చెప్పడానికి మా అమ్మ అతన్ని కొట్టినట్లు నాకు గుర్తుంది. కాస్టింగ్ కౌచ్ వాస్తవం. అయితే ప్రతి ఇండస్ట్రీలోనూ మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు అని ఆమె చెప్పుకొచ్చింది. రష్మీ దేశాయ్ ‘ఉత్తరన్’, ‘దిల్ సే దిల్ తక్’ వంటి టీవీ షోలలో కనిపించింది. ఇప్పుడు సినిమాల వైపు టర్న్ అయిన ఆమె మిషన్ లైలా, హిసాబ్ బరాబర్ అనే హిందీ సినిమాల్లో నటించింది.
తాజావార్తలు
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
-
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
-
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!