బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్‌లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద పీటం ఏర్పడింది.
Also Read : Tamannaah : తమన్నా vs సన్నీ లియోన్..అడల్ట్ మూవీలో మిల్కీ బ్యూటి..!
కొద్దిరోజుల క్రితం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సరసన రాషా టడానీ హీరోయిన్‌గా ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయిందని, ఆ తర్వాత మహేష్ కుటుంబం నుంచి హీరో జయకృష్ణ సరసన రాషా కథానాయికగా ఎంపిక అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా త్వరలో చిత్రీకరణకు వెళ్లనుందట. ఈ ప్రాజెక్ట్‌ను RX100 ఫేమ్ అజయ్ భూపతి లాంచ్ చేస్తారని, ప్రీ-ప్రొడక్షన్ కొనసాగుతోందని తెలిసింది. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్, కాస్టింగ్ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
