Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralay Movie: ‘ధురందర్’, ‘ధురందర్: ది రివెంజ్’ సినిమాలతో వరుసగా భారీ విజయాలు అందుకున్న రణ్వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన ఎంచుకున్న జానర్ కూడా బాలీవుడ్లో అరుదైనదే. జాంబీ, పోస్ట్ అపోకలిప్టిక్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘ప్రళయ్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే సినిమా నుంచి ఆఫీషియల్ గా ఫస్ట్ లుక్ కూడా రాకముందే సెట్స్ నుంచి కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో రణ్వీర్ కొత్త అవతార్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లీక్ వీడియోలో రణ్వీర్ సింగ్ ఓ చిన్నారిని తన వీపుపై మోసుకుంటూ గందరగోళంగా కనిపిస్తున్న వాతావరణంలో నడుస్తూ కనిపించాడు. అతడి పక్కనే మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ కూడా కనిపించింది. కళ్యాణి బ్రౌన్ ట్యాంక్ టాప్, గ్రీన్ ప్యాంట్లో కనిపించగా, రణ్వీర్ పొడవాటి జుట్టు, రగ్గడ్ లుక్‌తో కనిపించాడు. ఈ హెయిర్‌స్టైల్ చూసిన అభిమానులు వెంటనే ‘ధురందర్’లో అతడు పోషించిన హమ్జా పాత్రను గుర్తు చేసుకుంటున్నారు. మరో లీకైన ఫొటోలో జాంబీలను పోలిన వ్యక్తుల మధ్య రణ్వీర్ యాక్షన్ పోజులో కనిపించడం సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతోంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అయితే ‘ప్రళయ్’లో రణ్వీర్ పాత్ర ఎలా ఉండబోతోందన్నది మాత్రం ఇప్పటివరకు పూర్తిగా వెల్లడించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఘోరమైన మహమ్మారి తర్వాత ముంబై నగరం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. జాన జీవితం కుప్పకూలిపోయిన తర్వాత నగరంలో బతకడానికి పోరాడే వ్యక్తుల చుట్టూ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రళయ్’ కోసం దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నారనే రిపోర్టులు ఇప్పటికే వచ్చాయి. ఈ లెక్క నిజమైతే రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సోలో చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ముంబై లొకేషన్లలోనే షూటింగ్ చేయడం ద్వారా కథకు రియలిస్టిక్ ఫీల్ తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
ఇక ‘లొకః చాప్టర్ 1’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో రణ్‌వీర్‌కు జోడీగా నటిస్తోంది. ఆగస్టులో ముంబైలో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉంది. రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే తాజాగా లీకైన రణ్వీర్, కళ్యాణి లుక్స్ చూస్తుంటే.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందోనన్న ఆసక్తి మాత్రం ఇప్పుడే పెరిగిపోయింది. ‘ధురందర్’లో హమ్జాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రణ్వీర్.. ఇప్పుడు అదే పొడవాటి జుట్టుతో ఈసారి జాంబీల మధ్య సర్వైవల్ కోసం పోరాడే వ్యక్తిగా ఎలా ఉండబోతాడు? ‘ప్రళయ్’ బాలీవుడ్లో జాంబీ జానర్‌కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందా? అనేది తెలియాలంటే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వచ్చిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు