Site icon NTV Telugu

Ranbir Kapoor : ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ తర్వాత కనిపించని రణబీర్.. ఎందుకు ఈ గ్యాప్

Ranbeer

Ranbeer

రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకులకు ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ సెట్స్‌పై ఉన్నాయి. రామాయాణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో హై విజువల్స్ ఎఫెక్ట్స్ తో గ్రాండియర్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాడు నమిత్ మల్హోత్రా.

Also Read : SSMB : మహేశ్ బాబు ఫ్యాన్స్ కు షాక్.. ‘వారణాసి’ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసిన దర్శకుడు

రామాయణ కన్నా ముందే రణబీర్ మరో ఫిల్మ్ తో రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ తెరకెక్కుతోంది. ఆలియా, విక్కీకౌశల్,రణబీర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ డీలే కారణంగా  నెక్ట్స్ ఇయర్ ఈద్ అంటే మార్చి 20న రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ డేట్ నుండి కూడా తప్పుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. యానిమల్ తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన రణబీర్ నెక్ట్స్ ఇయర్ సెకండాఫ్ బాక్సాఫీసును దోచుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు హీరో నుండి ఫిల్మ్ మేకర్ గా మారబోతున్నాడట రణబీర్. తాత వారసత్వాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఆర్కే స్టూడియోను పునరుద్దరించనున్నాడని తెలుస్తోంది. నిర్మాతగా సినిమాలు తెరకెక్కించడంతో పాటు దర్శకుడిగా మారే ఛాన్స్ ఉందని బీటౌన్ కోడై కూస్తుంది. ఆయాన్ ముఖర్జీ, దీపికా పదుకొణేలతో చిత్రాలను తెరకెక్కించే ఛాన్స్ ఉందన్నది టాక్. ఈ సంగతి పక్కన పెడితే హీరోగా ఈ ఏడాది క్యామియోలతో సరిపెట్టేశాడు రణబీర్. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో కనిపించిన యానిమల్ హీరో దేదే ప్యార్ దే2లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడట. యానిమల్ రూపంలో ఎక్స్‌పెక్ట్‌ చేయని రీతిలో ఓ హిట్ పడగానే నెక్ట్స్ చేసే  సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ గ్యాప్ తీసేసుకుంటున్నాడు రణబీర్.

Exit mobile version