Site icon NTV Telugu

Rana : రానా – తేజ సినిమాకు ఏమైంది..?

Untitled Design 2024 08 09t125640.758

Untitled Design 2024 08 09t125640.758

టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో  హీరోగా  సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో  డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా.  ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి.  రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.  తేజ దర్శకత్వంలో రానా ‘రాక్షసరాజా’తో భారీ హిట్ కొడతాడు అనుకుంటే ఈ సినిమా అకారణంగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో రానా అభిమానులు కాస్త నిరుత్సహం చెందారు. కాగా గతంలో ‘రాక్షస రాజా’ నుంచి పోస్టర్ ని విడుదల చేయగా సినిమాపై భారీ హైప్ ను పెంచింది.

Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.?

గతంలో రానా – డైరెక్టర్ తేజా కాంబోలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రంలో రానాను సరికొత్తగా చూపించాడు తేజ. రానా – కాజల్ మధ్య ప్రేమ, రాజకీయ పరిణామాలు అన్నీ సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు. ఇప్పుడు వారిద్దరి కాంబోలో ఆ తరహా సినిమా ఉంటుందని అభిమానులు సంతోసించేలోపే ‘రాక్షసరాజా’ సినిమా  ఆగిపోయింది.  ప్రస్తుతం రానా ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. వెంకటేశ్ – రానా నటించిన రానా నాయుడు సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. దానికి కొనసాగింపుగా ఈ సిరీస్ రానుంది. మరి రానా దగ్గుపాటిని స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడో వేచి చూడాలి.

 

 

Exit mobile version