Site icon NTV Telugu

Rana Naidu 2: నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే?

Rana Naidu 2

Rana Naidu 2

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సీజన్ 2 రూపొందింది.

Exit mobile version