Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Krishnan as Kamala Reddy in David Reddy: మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల నిర్మిస్తున్నారు. 1897 నుంచి 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మరియా రియాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని, రమ్యకృష్ణ, అభయ్ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నేడు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా డేవిడ్ రెడ్డి చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె కమలా రెడ్డి పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది. పోస్టర్లో రమ్యకృష్ణ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండటంతో పాటు సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ ఫస్ట్‌లుక్‌ను చూస్తే ‘బాహుబలి’లో శివగామిగా రమ్యకృష్ణ చూపించిన పవర్ఫుల్ ఇమేజ్ మరోసారి గుర్తుకొస్తోంది. అయితే డేవిడ్ రెడ్డిలో కమలా రెడ్డి పాత్ర అంతకు మించిన ఉగ్రరూపంలో ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. బాహుబలి తర్వాత రమ్యకృష్ణకు మరోసారి ఆ స్థాయిలో గుర్తుండిపోయే పాత్ర దక్కినట్లే కనిపిస్తోంది.
Also Read
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
మంచు మనోజ్ కూడా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని పేర్కొంటూ.. డేవిడ్ రెడ్డి నుంచి ఉగ్రరూపం దాల్చిన కమలా రెడ్డిని పరిచయం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా సినిమాలో రమ్యకృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించే వరకు వేచి చూడాలని అభిమానులను కోరారు. డేవిడ్ రెడ్డిలో రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోంది?.. ఆమె యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మంచు మనోజ్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ.. రమ్యకృష్ణ పాత్రతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
One look. The entire frame belongs to her. 🔥
Happy Birthday, @meramyakrishnan garu! ❤️🙏🏻 An honour to share the screen with you!
Presenting the ferocious #KamalaReddy from #DavidReddy. ⚔️
Just wait till you see her in action. 🔥#HBDRamyaKrishnan garu pic.twitter.com/MDcVqlEsiA
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 15, 2026
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!