బాలీవుడ్‌లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, హీరో యశ్ .. రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సుర్పణకగా. రవి దూబే లక్ష్మణుడు, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రాలో కనిపించనున్నారు.దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీ స్టార్ట్ అయ్యి అని పనులు మొదలు పెట్టినప్పటి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డెట్ వదలేదు. మొన్న శ్రీరామనవమి రోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయాలని అనుకుంది చిత్రబృందం. కానీ అనుకోని కారణాలతో అది జరగలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ ‘రామాయణ’ పరిచయ వీడియోను ప్రదర్శించేందుకు ‘వేవ్స్ సమ్మిట్’ సరైన వేదిక అని నిర్ణయించుకున్నారు మూవీ టీం.
Alsi Read : Simran : ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు..
త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నాట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ‘వేవ్స్’ సమ్మిట్‌లో విడుదల అంటే ? వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (World Audio Visual & Entertainment Summit). అంటే ఏదైనా కొత్త ఉత్పత్తి లేదా ప్రకటనను ప్రదర్శించడానికి లేదా విడుదల చేయడానికి. ఇది సాధారణంగా మీడియా, వినోద పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం. ఈ సమ్మిట్‌ను ముంబైలో మే 1 నుండి 4 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో ను వదలనున్నారు.