Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలీజ్ అయి రెండు వారాలైనా ‘రామాయణ పార్ట్ వన్’ ర్యాంపేజ్ కొనసాగుతోంది. 1000 కోట్లు క్రాస్ చేసి, 2000 కోట్ల వైపు వడివడిగా అడుగులేస్తోంది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న మైథలాజికల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయగలదా? నెక్స్ట్ ఫ్రైడే ఆ సినిమాలు క్లిక్ అయితే ‘రామాయణ’ కలెక్షన్స్‌కి గండిపడినట్లేనా? ‘రామాయణ’ ఇండస్ట్రీలో సరికొత్త వండర్స్ అండ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దాటి, అత్యంత వేగంగా ఈ మార్క్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే ‘ధురంధర్’ లైఫ్ టైమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్‌ను జస్ట్ 11 డేస్‌లో బీట్ చేసేసింది. ఇంకా ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. రెండు వారాల్లోనే 1500 కోట్లు కొల్లగొట్టి, బ్రేక్ ఈవెన్‌కు అడుగు దూరంలో నిలుస్తోంది. 1800 నుంచి 2000 కోట్ల బడ్జెట్ అండ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఇప్పటివరకు 1600 కోట్ల వసూళ్లను సాధించింది. ‘రామాయణ పార్ట్ వన్’ 1800 కోట్లు కలెక్ట్ చేస్తే సేఫ్ కావడమే కాదు, టాలీవుడ్ టాప్ గ్రాసర్ మూవీస్ ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ రికార్డ్స్‌ను చెరిపివేసినట్లే.
ఇక్కడే కాదు, పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా మంచి వసూళ్లనే సాధిస్తోంది ఈ మైథాలజీ ఫిల్మ్. ఇప్పటివరకు నేపాలీ రూపాయల ప్రకారం ‘రామాయణ’ 25 కోట్లు వసూలు చేయగా, ‘పుష్ప 2’ 26.4 కోట్లతో హైయెస్ట్ గ్రాసర్ హిందీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. నేపాల్‌లో ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఇంకొన్ని గంటల్లో మటుమాయం కానున్నాయి. ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘రామాయణ’కు అసలు సిసలైన టాస్క్ వెయిట్ చేస్తోంది. ఇప్పటివరకు ఇండియా సినీ చరిత్రలో ‘దంగల్’ హైయెస్ట్ గ్రాసర్ మూవీ. 2000కు పైగా కలెక్ట్ చేసి టాప్ ప్లేస్‌ను ఆక్యుపై చేసింది. అది కూడా చైనా మార్కెట్ వల్లే ఈ నెంబర్స్ అచీవ్ చేయగలిగింది. ఈ టార్గెట్ ఇప్పుడు ‘రామాయణ’ ముందు ఉంది. అందుకు వారం రోజుల గడువే ఉంది. ఎందుకంటే నవంబర్ 27న ‘ఏ ప్రేమ్ మోల్లియా’, ‘గన్ మాస్టర్ G9’ చిత్రాలు విడుదలవుతాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అయినా ‘రామాయణ’ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం ‘రామాయణ’ కాస్త డల్ అయినా, ఈ వీకెండ్ పుంచుకునే ఛాన్స్ ఉంది. మరి నెక్స్ట్ ఫ్రైడే నాటికి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా ఈ మైథాలజీ ఫిల్మ్?
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!