Ramayana Glimpse: ‘రామా’ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. రాముడిగా రణబీర్ కపూర్ దర్శనం!
- భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’
- రాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్
- ‘రామా’ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor’s Ramayana Glimpse Date Locked: భారతీయ సినీ చరిత్రలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రామాయణకు నమిత్ మల్హోత్రా నిర్మాత కాగా.. దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీదేవోల్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రామాయణ చిత్రం నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ‘రామా’ గ్లింప్స్ విడుదల తేదీని నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.
ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ఈ గ్లింప్స్‌ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు. గ్లింప్స్ విడుదలకు హనుమాన్ జయంతిని ఎంచుకోవడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప విజువల్ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ‘రామాయణం ప్రతి ఒక్కరిది. ఈ కథను అత్యంత భక్తి, బాధ్యతతో నిజమైన రూపంలో తెరపైకి తీసుకురావడానికి మా టీమ్ కృషి చేస్తోంది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రామా గ్లింప్స్‌ను విడుదల చేసి ఈ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోబోతున్నాం’ అని నిర్మాత చెప్పారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
Also Read: Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!
మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అమెరికాలో తొలి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో రణబీర్ కపూర్, నితేష్ తివారి, నమిత్ మల్హోత్రా పాల్గొని ప్రత్యేక గ్లింప్స్, కీలక అంశాలను మీడియాతో పంచుకునే అవకాశముంది. వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యమైన రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!