Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana vs Dangal Box Office Collection: ‘రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిన ‘దంగల్’ రికార్డుపై కన్నేసింది. రామాయణ ఇప్పటికే రూ.1,500 కోట్ల మార్కును దాటినప్పటికీ.. అగ్రస్థానాన్ని దక్కించుకోవాలంటే మాత్రం ఇంకా భారీ మొత్తంలో వసూళ్లు సాధించాల్సి ఉంది. రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత రామాయణ జోరు చూస్తే.. త్వరలోనే దంగల్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
థియేటర్లలో 15 రోజులు పూర్తి చేసుకున్న రామాయణ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,547.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. 15వ రోజు భారతదేశంలో రూ.19.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇందులో హిందీ వెర్షన్ ఒక్కటే రూ.14 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో 15వ రోజు రూ.14 కోట్లు కొల్లగొట్టింది. దీంతో విదేశాల్లో రామాయణ మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.515 కోట్లకు చేరాయి. దేశీయ, విదేశీ మార్కెట్ల వసూళ్లను కలిపి చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా రామాయణ కలెక్షన్లు రూ.1,547.15 కోట్లకు చేరుకున్నాయి.
Also Read
- Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
- Rajkumar Periasamy: ‘ఓం’ సినిమాలో ఆ సందేశం ఉండదు.. రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌కుమార్!
- Dulquer Salmaan: దుల్కర్ సడెన్ సర్ప్రైజ్.. కొత్త సినిమా టైటిల్ ఇదేనట!
- Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో 2016లో విడుదలైన దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ.2,070.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు కొనసాగుతోంది. ప్రస్తుతం రామాయణ వసూళ్లు రూ.1,547.15 కోట్లుగా ఉంది. దంగల్ను అధిగమించాలంటే మరో రూ.523.15 కోట్లు రాబట్టాల్సి ఉంది. అంటే రూ.2,000 కోట్ల మార్కును దాటడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాన్ని అందుకోవాలంటే రామాయణ తన వసూళ్ల జోరును మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో దంగల్ రికార్డును అధిగమిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
-
SCO Forum 2026: నేడు తొలి SCO ఫోరమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
-
IND vs NZ 1st Test: కివీస్‌కు దీటుగా భారత్ బదులు.. జైస్వాల్ సెంచరీ మిస్, రాహుల్ హాఫ్ సెంచరీ!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!