Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest 5th Day Collections for Ramayana Part 1: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన రామాయణ.. మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐదవ రోజు, పోస్ట్ దీపావళి రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అరుదైన ఘనత అందుకుంది.
సోమవారం ఐదో రోజు కూడా రామాయణ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించింది. ఐదో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.126 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వసూళ్లతో ఐదో రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా, అలాగే పోస్ట్ దీపావళి రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమా విజయాన్ని అభిమానులతో పంచుకుంది.
Also Read
- Ram Charan: 'చిరు లీక్స్' లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
- Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
- Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. 'వారణాసి' థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
- Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
రామాయణ: పార్ట్ 1 ఐదో రోజు ఇండియాలో రూ.107.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఐదు రోజుల్లో భారతదేశంలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.346.35 కోట్లకు చేరాయి. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.413.90 కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. ఐదు రోజుల్లో విదేశాల్లో రూ.250 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.663.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఐదు రోజుల్లోనే రూ.663.90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడంతో రామాయణ బాక్సాఫీస్ కలెక్షన్లపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరనుంది. రానున్న రోజుల్లో రామాయణ మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
-
iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
-
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
-
Supreme Court Judgment: ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే..
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!