టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిల మధ్య మరోసారి వార్ నడవనుందా. ఇప్పటికే శ్రీలీల ఆఫర్లను కొల్లగొడుతూ కాంపిటీషనైన మీనమ్మా.. కిస్సిక్ బ్యూటీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోందా…? అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. గుంటూరు కారంలో కలిసొచ్చిన ఈ ఇద్దరు భామలు నెక్ట్స్ పొంగల్ దంగల్‌కు రెడీ అయ్యారు. అనగనగా ఒక రాజు సంక్రాంతికే వస్తున్నట్లు ఎనౌన్స్ చేయగా.. రీసెంట్లీ పరాశక్తిని కూడా 2026 జనవరి 14కే తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అదే డేట్‌కు రాబోతుంది ఫిల్మ్.
Also Read : PEDDI : ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్ రెడీగా ఉండండి
మీనాక్షి చౌదరి లాస్ట్ సంక్రాంతికే కాదు.. ఈ పండుగకు కూడా హిట్టు కొట్టేసింది. సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్న మీనమ్మ.. నెక్ట్స్ పొంగల్ కూడా హిట్ అందుకుని.. సంక్రాంతి ముద్దుగుమ్మగా మారాలనుకుంటే.. సడెన్లీ రేసులోకి దూసుకొచ్చింది శ్రీలీల. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మిస్ లీల. అనగనగా ఒక రాజు తమిళంలో విడుదలయ్యే ఛాన్స్ లేదు.. సో అక్కడ పోటీ లేకపోయినప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం ఇద్దరి భామల మధ్య పోటీ తప్పేట్లు లేదు. యాక్చువల్లీ నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఫస్ట్ ఛాయిస్ శ్రీలీలనే. కానీ వేరే ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ వల్ల కిస్సిక్ బ్యూటీ తప్పుకుంది. ఈ ఆఫర్ మీనూ దగ్గరకు వెళ్లింది. అదే కాదు నాగ చైతన్య 24 కూడా అలా ఆమె చేతి నుండి మిస్సైతే.. అది కూడా మహేష్ బాబు రీల్ మరదల్ చెంతకు చేరింది. దీంతో ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఎట్మాస్పియర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి ఇద్దరు వస్తుండటంతో క్యూరియాసిటీ కలిగిస్తోంది. మరి ఈ ఇద్దరు భామల్లో ఎవరు సంక్రాంతి ముద్దుగుమ్మగా నిలుస్తారో? ఈ విషయం తేలాలంటే పండుగ వరకు ఆగాల్సిందే..
