రామ్ పోతినేని (RAPO) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ స్క్రీన్ పై తన నటన, ఎనర్జిటిక్ డాన్సులతో అలరించే రామ్.. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సరికొత్త అవతారమెత్తారు. ఆయన కథ అందిస్తూ, స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘#RAPO23’. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ భారీ బడ్జెట్ దృశ్యకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ తమిళనాడులోని అందమైన తీరప్రాంతం పాండిచ్చేరిలో వేగంగా జరుగుతోంది. దాదాపు 15 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్‌లో విజువల్ వండర్‌గా నిలిచే ఒక ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నేతృత్వంలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది.
పాటతో పాటుగా, ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లను కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కాంతార’, ‘కరుప్పు’ వంటి పాన్-ఇండియా హిట్ సినిమాలకు గూస్‌బంప్స్ తెప్పించే స్టంట్స్ డిజైన్ చేసిన ప్రముఖ ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ ఈ చిత్రానికి యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. ఒకే సమయంలో సెట్స్‌పై హీరోగా మాస్ ఎనర్జీ చూపిస్తూనే, దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్‌నూ చెక్కుతున్న రామ్ పోతినేని వర్కింగ్ క్రమం యూనిట్ సభ్యులను ఆకట్టుకుంటోంది. సినిమాలోని విజువల్ క్వాలిటీ, ఎమోషన్ అనుకున్న స్థాయిలో వచ్చేంతవరకు ఆయన రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
సాంకేతిక దిగ్గజాల సమాహారం
ఈ చిత్రం కేవలం ఒక రెగ్యులర్ యాక్షన్ డ్రామా కాదు.. నియో-నోయర్ నేపథ్యంతో సాగే విభిన్నమైన సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుక్కరసు (తిర్రు) అందించే దృశ్యాలు చిత్రానికి విజువల్ గ్రాండియర్ కానున్నాయి. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూమ్‌ని షేక్ చేసే సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్, విక్రమ్ మోర్ వంటి టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్లు సాహసోపేతమైన ఫైట్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ నిర్మిస్తున్న భారీ సెట్స్ ఈ కథా ప్రపంచానికి ప్రాణం పోయనున్నాయి.
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23

Ram Pothineni
