Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయం నుంచి కోలుకునే క్రమంలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. కొద్దిరోజుల క్రితం చేతి మణికట్టుకు తగిలిన గాయంతో చికిత్స తీసుకుంటున్న చరణ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్య వర్గాల నుంచి కీలక అప్డేట్ వెలువడింది. తమిళనాడులోని ప్రముఖ కోయంబత్తూరు గంగా హాస్పిటల్లో ఆయనకు ప్లాన్ చేసిన ఫాలో-అప్ మెడికల్ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తయింది. ఈ సర్జరీ అనంతరం చరణ్ మణికట్టుకు అమర్చిన క్యాస్ట్, రాడ్స్‌ను వైద్యులు సక్సెస్‌ఫుల్‌గా తొలగించారు. మణికట్టు భాగంలో గాయం తీవ్రత దృష్ట్యా గతంలో వైద్యులు ప్రత్యేకంగా రాడ్స్‌ను అమర్చి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎముక నిర్మాణం పూర్తిగా స్థిరపడటంతో, గంగా హాస్పిటల్ వైద్య బృందం ఆ రాడ్స్‌ను, క్యాస్ట్‌ను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎముక రికవరీ ఆశించిన దానికంటే చాలా వేగంగా జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
రాడ్స్ తొలగించినంత మాత్రాన వెంటనే సాధారణ స్థితికి రావడం సాధ్యం కాదు కాబట్టి, వైద్యుల పర్యవేక్షణలో చరణ్‌కు మరో కీలక చికిత్స స్టార్ట్ కానుందని తెలుస్తుంది. చేతికి పూర్వపు బలం, పూర్తి స్థాయి కదలికలు రావడానికి రాబోయే 8 నుంచి 10 వారాల పాటు ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ సెషన్లలో ఆయన పాల్గొననున్నారట. ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఈ రిహాబిలిటేషన్ ప్రక్రియ జరగనుందని తెలుస్తుంది. ఎముకపై అదనపు భారం పడకుండా దశలవారీగా చేతి కండరాలను బలోపేతం చేసేందుకు వైద్యులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఫిజియోథెరపీ ప్రక్రియ అనుకున్న సమయానికి ముగిస్తే, నవంబర్ మధ్య నాటికి రామ్ చరణ్ తిరిగి పూర్తి ఫిట్నెస్తో కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ షూటింగ్ చరణ్ కోలుకున్న వెంటనే శరవేగంగా ప్రారంభం కానుందని తెలుస్తుంది. గాయం భయాలు పూర్తిగా తొలిగిపోయి, రాడ్స్ తొలగించారన్న సమాచారం బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. పూర్తి ఉత్సాహంతో తమ అభిమాన హీరో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
గాయం నుంచి కోలుకునే క్రమంలో మరో కీలక అడుగు..
కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో రామ్ చరణ్‌కు ప్లాన్ చేసిన ఫాలో-అప్ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తైంది. మణికట్టుకు వేసిన క్యాస్ట్, రాడ్స్‌ను తొలగించారు. ఇక 8–10 వారాల పాటు ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ.. నవంబర్ మధ్యలో షూటింగ్స్‌లోకి #RamCharan… pic.twitter.com/EpOKbyopTV
— Journalist Yagna (@yagnamurthy) September 24, 2026
తాజావార్తలు
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!