‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, మొదటి సినిమాతోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన ‘మగధీర’ మూవీతో టైర్ వన్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబు అనే చెవిటివాడి పాత్రలో నటించి, తనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో భారీ విజయాలను అందుకోలేకపోతున్నాడు. దాంతో మరోసారి సుకుమార్ డైరెక్షన్లోనే సినిమా చేస్తున్నాడు. నిజానికి వీళ్లిద్దరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన ‘రంగస్థలం’ మూవీ భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ కాంబో మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న సుకుమార్, ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో విలన్ పాత్రను సైతం రామ్ చరణ్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ సర్కిల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సుకుమార్ సినిమాల్లో హీరో చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. క్యారెక్టరైజేషన్ మీద కథను రాసుకోవడంలో సుకుమార్ సిద్ధహస్తుడు. అందుకే ఈ సినిమాలో సైతం రామ్ చరణ్ పాత్రను సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తిగా చూపిస్తూనే, ఫైనల్‌గా తననే విలన్ అని ప్రేక్షకుడిని నమ్మించేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడట. మొదటి నుంచి ఆయన క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేసుకుంటూ వచ్చి, హీరోలోనే విలన్ ఉన్నాడనే విషయాన్ని చివర్లో రివీల్ చేస్తాడట. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కొద్దిసేపు కనిపిస్తాడు. కాబట్టి నటనలో ఆయన మరో మెట్టు పైకి ఎక్కడం పక్కా అంటూ మెగా అభిమానులు ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం మీద సుకుమార్, రామ్ చరణ్‌ల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. తొందర్లోనే దీని మీద వాళ్లు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారట.

