Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (PEDDI) సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ల కోసం ముంబై వెళ్లిన రామ్ చరణ్, అక్కడ కుడి చేతికి రిస్ట్ బ్యాండేజ్ (Hand support brace) కట్టుకుని కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చరణ్ చేతికి ఏమైంది? షూటింగ్లో ఏమైనా పెద్ద ప్రమాదం జరిగిందా? అని అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు.
ముంబై పర్యటనలో భాగంగా రామ్ చరణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ‘హాకీమ్ ఆలిం’ సెలూన్‌కు వెళ్లారు. అక్కడ చరణ్ కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ధరించి ఉండటం గమనించిన కొందరు ఫోటోలు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చిత్ర యూనిట్, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. రామ్ చరణ్‌కు కుడి చేతి మణికట్టు వద్ద ఒక చిన్న మితమైన గాయం (Minor sprain/నొప్పి) అయింది. అంతకు మించి కంగారుపడాల్సిన పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. కేవలం ముందుజాగ్రత్త చర్యగా, ఆ నొప్పి మరింత ఎక్కువ కాకుండా త్వరగా కోలుకోవడానికి (Fast recovery) మాత్రమే డాక్టర్ల సలహా మేరకు ఈ సపోర్ట్ బ్యాండేజ్ ధరించినట్లు తెలుస్తోంది. ఈ చిన్న గాయం కారణంగా ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌కు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. మే 18న ముంబైలో జరగబోయే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ పూర్తి ఎనర్జీతో పాల్గొనబోతున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!