గత కొద్ది రోజులుగా రామ్ చరణ్, ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. నిజానికి, ప్రస్తుతానికి రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే, సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి కాస్త గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడం కోసం రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయవచ్చనే ప్రచారం జరిగింది.
Good Bad Ugly: కొడుకు డైరెక్టర్ తండ్రి అసోసియేట్ డైరెక్టర్
కాకపోతే, ఈ వార్త కేవలం ప్రచారానికి పరిమితమైంది. ఎందుకంటే, ఇది నిజం కాదని రామ్ చరణ్ సన్నిహిత వర్గాల సమాచారం. సందీప్ రెడ్డి వంగ ఒక సినిమాను పట్టాలెక్కించాలంటే, స్క్రిప్ట్ వర్క్‌ను చాలా పకడ్బందీగా చేస్తాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి లోపు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది పూర్తి కాకముందే రామ్ చరణ్ సినిమాపై ఫోకస్ చేయడం కష్టమని అంటున్నారు.
‘స్పిరిట్’ పూర్తయిన తర్వాత, సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్‌తో ‘అనిమల్ పార్క్’ ప్లాన్ చేశాడు. ఇప్పటికే షెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు. వీరిద్దరూ కొన్నిసార్లు సినిమా గురించి చర్చించారు, కలిసి పనిచేయాలనుకున్నారు, కానీ ఇప్పట్లో అది సాధ్యం కాదు. రామ్ చరణ్ ‘పెద్ది’ తర్వాత, సుకుమార్ సినిమా మొదలయ్యేలోపు మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే, దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.