Anaswara Rajan: మలయాళ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనశ్వర రాజన్, ఇప్పుడు టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ‘ఛాంపియన్’ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ మలయాళ కుట్టికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ బూస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అనశ్వర టాలెంట్‌పై నమ్మకంతో రామ్ చరణ్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె కచ్చితంగా టాలీవుడ్‌లో సక్సెస్ చూస్తుందని, రేపు విడుదలవుతున్న ‘ఇట్లు అర్జున’తో పాటు సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి ‘కాకా’ సినిమాతో బ్లాక్‌బస్టర్స్ కొడుతుందని చరణ్ హైప్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు అనశ్వరకు పెద్ద బూస్టర్‌లా మారాయి. మరి చరణ్ చెప్పినట్టుగా రేపటి సినిమాతో ఈ బ్యూటీ జాతకం మారి, టాలీవుడ్‌లో సాలీడ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
అనశ్వర హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఇట్లు అర్జున’లో అనీష్ కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించారు. అక్టోబర్ 2న రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ, ఎట్టకేలకు రేపు (నవంబర్ 13న) థియేటర్లలోకి వస్తోంది. టాలీవుడ్‌లో అనశ్వర కెరీర్ నిలబడాలంటే ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా కీలకం. టాలీవుడ్‌లో సరైన హిట్ లేకపోయినా అనశ్వర లైనప్ మాత్రం అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే మాస్ మహారాజా రవితేజ ‘తులాభారం’ మూవీలో ఓ ముఖ్యమైన రోల్ చేస్తోంది. వీటితో పాటు యంగ్ హీరో సంగీత్ శోభన్ సరసన ‘అంతా రాములోరు చూసుకుంటారు’ సినిమాలో జోడీ కడుతోంది. ఇంతటి క్రేజీ లైనప్ ఉన్న ఈ మలయాళ బ్యూటీకి, రేపటి రిలీజ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

