Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒకే సమయంలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాల అప్డేట్స్ రావడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందునా గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల చిత్రాల ప్రమోషన్స్ ఒకేసారి షురూ అవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాది (నార్త్) ప్రేక్షకులను నేరుగా టార్గెట్ చేస్తూ, ఈ ఇద్దరు హీరోలు తమ ఈవెంట్స్ కోసం ముంబై వేదికను ఎంచుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (PEDDI) చిత్ర ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి వేదిక మారింది. మొదట ఈ ఈవెంట్‌ను భోపాల్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ వేదికను దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మార్చారు. మే 18న ముంబైలో జరగబోయే ఒక గ్రాండ్ ఈవెంట్లో ‘పెద్ది’ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానుండటంతో ఈ ట్రైలర్ హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇక రామ్ చరణ్ ట్రైలర్ హడావిడి ముగిసిన మరుసటి రోజే, అంటే మే 19న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వంతు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఒక స్పెషల్ గ్లింప్స్/టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ముంబైలో నేషనల్ మీడియా సమక్షంలో ఈ గ్లింప్స్‌ను ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. తారక్ బర్త్‌డే (మే 20) కానుకగా ఒకరోజు ముందే రాబోతున్న ఈ అప్డేట్ కోసం నార్త్ ఆడియన్స్ సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్-టు-బ్యాక్ రోజుల్లో ఈ రెండు భారీ చిత్రాల అప్డేట్స్ వస్తుండటంతో సోషల్ మీడియాలో మెగా, నందమూరి అభిమానుల హడావిడి పీక్స్‌కు చేరడం ఖాయం.
తాజావార్తలు
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?