Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satish Kilaru: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకు సంబంధించి కీలక విశేషాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నా తొలి సినిమా రామ్ చరణ్ గారితో చేయడం నా అదృష్టం. ‘పెద్ది’ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్ నుంచి కదలలేరు. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ పెద్దిలో ఫుల్ ప్యాక్డ్ గా ఉన్నాయి. రంగస్థలం షూటింగ్ సమయంలో నాకు ఒక సినిమా చేసి పెట్టాలని చరణ్ గారిని అడిగాను. నిజానికి రెండు మూడు సందర్భాల్లో చేయాల్సిన సినిమాలు మిస్ అయ్యాయి, చివరికి బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా నిర్మించాను. కేవలం ఇచ్చిన మాట మీద ఆయన సినిమా చేశారు. ఎలాంటి అగ్రిమెంట్ల లాంటివి కూడా జరగలేదు. ఇది నేను అనుకుంటే అయ్యింది కాదు రామ్ చరణ్ అనుకున్నారు కాబట్టే జరిగింది’ అని అన్నారు.
Also Read
- Nayanthara : మహాశక్తి'తో కంబ్యాక్ ఇస్తుందా?
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
పెద్ది షూటింగ్ సమయంలో హీరో రామ్ చరణ్‌కి ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలయ్యాయని చెప్పారు. నిజానికి ఆ మూడు మేజర్ ఇంజ్యూరీస్ అయినా డేట్స్ ఇబ్బంది అవ్వకూడదని, గాయం తగిలిన తర్వాతి రోజు కూడా ఆయన షూట్‌కి వచ్చేసేవారు అని చెప్పారు. పెద్ది సినిమాకి రామ్ చరణ్ సపోర్ట్ ఏమాత్రం మరవలేనిది అన్నారు. తాజాగా ముంబైలో రామ్ చరణ్ చేతికి బ్రేసెస్‌తో కనిపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా వెంకట సతీష్ కిలారు వైరల్ అవుతున్న ఫోటోకు సంబంధించిన క్లారిటీని ఇచ్చారు. కుస్తీ ఫైట్ జరుగుతున్నప్పుడు ఆయనకు మణికట్టుకు గాయమైంది.. దానికి ఆయనకి ఎల్లుండి సర్జరీ చేయబోతున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?