Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ రోజు పెద్ది చిత్ర బృందం నిర్వహించిన రిలీజ్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్లో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘సుకుమార్ గారికి థాంక్యూ. ‘పెద్ది’ ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి.ఇది ఒక కమర్షియల్ ఎమోషనల్ రైడ్. మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది. పెద్దిని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. చరణ్ సార్‌పై నా ప్రేమ జూన్ 4న మీరు చూస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి థాంక్యూ సో మచ్’ అని అన్నారు. అనంతరం ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమాగా ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. బుచ్చిబాబు చాలా అద్భుతంగా సినిమా తీశారు. రామ్ చరణ్, జాన్వి కపూర్ ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడండి. పెద్ది కమర్షియల్, ఎమోషనల్ రైడ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్స్ లో చూడగలిగే సినిమా. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. జూన్ 3 ఈవెనింగ్ అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి. షూటింగ్ జరిగిన రోజులన్నీ రామ్ చరణ్ గారితో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం మాకు పెట్టేవారు. ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!