Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా నుండి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ‘ఊరమాస్ ట్రీట్’ వచ్చేసింది.. ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.
ప్రోమో కట్ చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఈ స్పెషల్ మాస్ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) మార్క్ ఎనర్జిటిక్ బీట్స్, రామ్ చరణ్ ఊరమాస్ గ్రేస్ ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్, ఈ చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ముగ్గురు స్టార్స్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఊరమాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఫ్లోర్‌పై అరాచకం సృష్టించారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
కాగా మే 23న (రేపు) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించబోయే ఒక గ్రాండ్ లైవ్ ఈవెంట్లో ఈ ఫుల్ సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ స్వయంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. కేవలం ప్రోమోతోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సాంగ్.. రేపు ఫుల్ లిరికల్/వీడియో బయటకు వచ్చాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Sing with us #Hellallallo💃🕺💃💥💥
▶️https://t.co/nxKOgVIGVz#Hellallallo Promo out now ❤️🔥 Full song grand launch at BHOPAL from May 23rd ✨️#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥 pic.twitter.com/06vu9stuRl
— PEDDI (@PeddiMovieOffl) May 22, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!