Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్

Peddi Bhopal Event

Peddi Bhopal Event

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదుగా జరిగే విధంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఒక సరికొత్త ఆడియో లాంచ్ ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. భోపాల్ వేదికగా నేడు (మే 23) జరగబోయే ఈ మెగా మ్యూజికల్ నైట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనలతో పాటు ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వయంగా హాజరవుతున్నారు. ఈ ఈవెంట్‌లో రెహమాన్ అండ్ టీమ్ ఇవ్వబోయే లైవ్ పర్ఫార్మెన్స్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

‘ఎన్‌టీవీ’ (NTV) అందించిన తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ ఈవెంట్ కేవలం ఒక సాధారణ ప్రెస్ మీట్‌లా కాకుండా ఒక భారీ మ్యూజికల్ కాన్సెర్ట్‌లా సాగబోతోంది. ఈ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్.. అతని సింగర్స్ టీమ్ ‘పెద్ది’ సినిమా నుండి ఏకంగా రెండు సరికొత్త పాటలను స్టేజ్‌పై లైవ్‌లో పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఇందులో నిన్న ప్రోమోతో దుమ్ములేపిన మాస్ సాంగ్ కూడా ఉండటం విశేషం. కేవలం ‘పెద్ది’ పాటలు మాత్రమే కాకుండా, ఏఆర్ రెహమాన్ తన కెరీర్‌లోని పాత క్లాసిక్ అండ్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల తాలూకూ పాటలను కూడా ఈ వేదికపై లైవ్‌లో పాడి వినిపించబోతున్నారు.

భోపాల్ నగరంలో ఇంత భారీ ఎత్తున తెలుగు సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. అంతే కాదు మధ్యప్రదేశ్ సీఎం కూడా ఈ ఈవెంట్ కి ముఖ్య అథిదిగా వస్తారంటున్నారూ.  జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, నార్త్ బెల్ట్‌లో కూడా సినిమాకు భారీ హైప్ అండ్ క్రేజ్ తీసుకురావడానికే మేకర్స్ ఈ రేంజ్ ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేడు జరగబోయే ఈ మ్యూజికల్ కాన్సెర్ట్‌తో ‘పెద్ది’ ఆల్బమ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.