గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది. సినిమా ఫస్ట్ రివ్యూ, రన్‌టైమ్‌పై ఓ స్ట్రాంగ్ ఇన్‌సైడ్ ఇన్ఫో బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. నిడివి కాస్త ఎక్కువే అనిపించినా, ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టకుండా, లాగ్ లేకుండా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా బుచ్చిబాబు ఈ ఊర మాస్ బొమ్మను దించినట్లు ఇన్‌సైడ్ టాక్.
సినిమా మొత్తానికి రామ్ చరణ్ యాక్టింగే మెయిన్ హైలైట్‌గా నిలవనుందట. ఆయన మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో మాస్ జాతర చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యానికి ఒక బలమైన, బరువైన ఎమోషన్స్‌ను జోడించి పక్కా కమర్షియల్ మీటర్‌లో ఈ కథను అద్భుతంగా అల్లారని సమాచారం. ఇక సినిమాకు అసలైన సోల్ చివరి 50 నిమిషాలే, ప్రేక్షకులను ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లి, కన్నీళ్లు పెట్టించడం పక్కా అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి ‘పెద్ది’తో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
