Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం చుట్టూ వివాదాల ముసురు అలుముకుంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ సీన్లపై విమర్శలు రావడం, దాంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ సీన్లు ట్రిమ్ చేయడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఏకంగా లీగల్ ట్రబుల్స్‌ను ఫేస్ చేస్తోంది. ఈ సినిమా మేకర్స్‌పై ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ గిరిజన నాయకులు, సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల్లోను, రాజకీయ వర్గాల్లోను సరికొత్త కలకలం రేగుతోంది.
‘పెద్ది’ సినిమాలో గిరిజన వ్యక్తులను, వారి సంస్కృతిని తక్కువ చేసి చూపేలా.. అత్యంత అవమానకరంగా ఉండే పలు డైలాగులు ఉన్నాయని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. సినిమాలో ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో వాడిన కొన్ని పదాలు, సంభాషణలు తమ మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమాలో కొన్ని సార్లు రామ్ చరణ్ పాత్రను ఉద్దేశిస్తూ కొండ నా *** అనే పదాలు వాడారు. ఇక ఈ విషయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఉన్నతాధికారులకు, పోలీసులకు గిరిజన సంఘాల ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదులు సమర్పించారు. ఈ వివాదంలో కేవలం సినిమాను తెరకెక్కించిన వారినే కాకుండా.. దాన్ని ఆమోదించిన వారిని కూడా వదిలే ప్రసక్తే లేదని గిరిజన నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమాలో అభ్యంతరకర డైలాగులు పెట్టినందుకు గాను దర్శకుడు బుచ్చిబాబు సానా, చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ (మైత్రి మూవీ మేకర్స్/వృద్ధి సినిమాస్), అలాగే సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఉన్న ఆ డైలాగులను కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇచ్చిన ‘సెన్సార్ బోర్డు’ సభ్యులపై కూడా తక్షణమే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!