Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘PEDDI’ (పెద్ది). ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి మెగా అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేమికులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన కొన్ని సంచలన, ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు బుచ్చిబాబు సానా మొదటిసారి బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక ఉన్న జర్నీని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”మొదట ఈ సినిమా ఒక చిన్న లైన్ (ఐడియా) లాగా మాత్రమే స్టార్ట్ అయింది. ఆ పాయింట్‌ను మా గురువుగారు సుకుమార్ గారికి చెప్పా.. ఆయనకు విపరీతంగా నచ్చేసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ గారి ఆమోదం లభించిన తర్వాత, నేను పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లాను. అక్కడ గుడి ప్రాంగణంలోనే కూర్చుని ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను, స్క్రిప్ట్‌ను రాసుకున్నాను” అని బుచ్చిబాబు చెప్పారు.
చరణ్ గారికి చెప్పేటప్పుడు మార్పులు చేయకూడదని మొక్కుకున్నా!
కథ పూర్తి కాగానే రామ్ చరణ్‌కు వినిపించే సమయంలో ఒక ఆసక్తికరమైన మొక్కు మొక్కుకున్నట్లు బుచ్చిబాబు చెప్పారు. “నేను గుడిలో రాసుకున్న కథను చరణ్ గారికి చెప్పేటప్పుడు.. స్క్రిప్ట్‌లో ఒక్క మార్పు కూడా చేయకూడదు, ఆయనకు కథ సింగిల్ సిట్టింగ్‌లోనే నచ్చాలి అని దేవుడిని మొక్కుకున్నా. నా అదృష్టం కొద్దీ చరణ్ గారికి కథ అద్భుతంగా నచ్చింది. నేను ఎలాగైతే అనుకున్నానో, ఎలాంటి మార్పులు లేకుండా ఆయన ఈ కథను అలాగే అంగీకరించారు” అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ‘పెద్ది’ చిత్రంపై మెగా అభిమానుల్లో అంచనాలు స్కై హైకి చేరాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
తాజావార్తలు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!