Peddi : 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది

Peddi 400

Peddi 400

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు సరికొత్త నిదర్శనం ‘పెద్ది’. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ ఇన్స్పైరింగ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మిక్స్ టాక్‌ తెచ్చుకున్నా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹400 కోట్ల (400 CR+ GROSS) క్లబ్‌లో చేరి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈ అసాధారణ వసూళ్లతో 2026 సంవత్సరానికి గానూ సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన నెం.1 చిత్రంగా ‘పెద్ది’ రికార్డుల దుమ్ము దులిపేసింది. రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు సన టేకింగ్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడంతో ఈ రేంజ్ విధ్వంసం సాధ్యమైందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. రత్నవేలు విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేటర్ల వద్ద ఇప్పటికీ జనాల తాకిడి తగ్గకపోవడంతో లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని మైలురాళ్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా పవర్‌స్టార్ సృష్టించిన ఈ ₹400 కోట్ల గ్లోబల్ విధ్వంసంతో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తూ సోషల్ మీడియాలో రికార్డుల పండగ చేసుకుంటున్నారు.

×
×
Ad