Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు సరికొత్త నిదర్శనం ‘పెద్ది’. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ ఇన్స్పైరింగ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మిక్స్ టాక్ తెచ్చుకున్నా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹400 కోట్ల (400 CR+ GROSS) క్లబ్లో చేరి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈ అసాధారణ వసూళ్లతో 2026 సంవత్సరానికి గానూ సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన నెం.1 చిత్రంగా ‘పెద్ది’ రికార్డుల దుమ్ము దులిపేసింది. రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు సన టేకింగ్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడంతో ఈ రేంజ్ విధ్వంసం సాధ్యమైందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. రత్నవేలు విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేటర్ల వద్ద ఇప్పటికీ జనాల తాకిడి తగ్గకపోవడంతో లాంగ్ రన్లో ఈ సినిమా మరిన్ని మైలురాళ్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా పవర్‌స్టార్ సృష్టించిన ఈ ₹400 కోట్ల గ్లోబల్ విధ్వంసంతో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తూ సోషల్ మీడియాలో రికార్డుల పండగ చేసుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!