మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (PEDDI) సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీజనల్ సెన్సార్ బోర్డ్ (CBFC) ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేయడంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ విధించిన కట్స్, సినిమా రన్‌టైమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే..
ఈ సినిమాలో కథా నేపథ్యం పల్లెటూరి వాతావరణంలో సాగడం, పాత్రల స్వభావం కాస్త ఊరమాస్‌గా ఉండటంతో సెన్సార్ బోర్డ్ కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, కథలోని సహజత్వాన్ని దెబ్బతీయకుండా కేవలం కొన్ని చిన్న మార్పులు, కట్స్‌తోనే బోర్డు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ‘సలార్’, ‘యానిమల్’ వంటి భారీ యాక్షన్ డ్రామా సినిమాల తరహాలోనే ‘పెద్ది’ చిత్రానికి కూడా భారీ రన్‌టైమ్ లాక్ చేశారు. సినిమా మొత్తం రన్‌టైమ్ 189 నిమిషాలు (3 గంటల 9 నిమిషాలు) గా నిర్ధారించారు.
అయితే మరి సెన్సార్ బోర్డ్ విధించిన కీలక మార్పులు అంటే డైలాగ్ మ్యూట్స్ & బూతులు.. ఏంటీ అంటే ఈ సినిమాలో అక్కడక్కడా పాత్రల మధ్య వచ్చే కొన్ని ఇంటెన్స్ బూతు పదాలను అసభ్యకరమైన డైలాగ్స్‌ను బోర్డ్ మ్యూట్ చేయించింది. సబ్‌టైటిల్స్‌లో కూడా ఆ పదాలను తొలగించబోతున్నారు. మూవీలో ‘చికిరి’ (Chikiri) అనే స్పెషల్ సాంగ్‌లోని “సరుకు సామన్” అనే లూజ్ కామెంట్‌ను మార్చాలని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. అలాగే సినిమాలోని ఒక నిర్దిష్ట సీన్ లో వచ్చే ‘రాజస్తాన్’ అనే పదాన్ని, అలాగే ఒక సామాజిక వర్గానికి లేదా కమ్యూనిటీకి నష్టం కలిగించేలా ఉన్న రిఫరెన్స్‌ను పూర్తిగా తొలగించారు. ఇంకా ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో ఒక క్యారెక్టర్ ‘మిడిల్ ఫింగర్’ (Middle Finger) చూపించే విజువల్‌ను నేరుగా డిస్‌ప్లే చేయకుండా, దానిపై సీజీ (CG) ఎఫెక్ట్స్‌తో కవర్ చేయాల్సిందిగా బోర్డు ఆదేశించింది. ఈ మార్పులన్నీ కేవలం డైలాగ్స్ చిన్న చిన్న విజువల్స్ వరకే పరిమితం కావడంతో సినిమా అసలు రన్‌టైమ్ అయిన 189 నిమిషాలలో పై ఎలాంటి ఏఫేక్ట్ పడలేదు.
