Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (PEDDI) సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీజనల్ సెన్సార్ బోర్డ్ (CBFC) ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేయడంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ విధించిన కట్స్, సినిమా రన్టైమ్కు సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే..
ఈ సినిమాలో కథా నేపథ్యం పల్లెటూరి వాతావరణంలో సాగడం, పాత్రల స్వభావం కాస్త ఊరమాస్‌గా ఉండటంతో సెన్సార్ బోర్డ్ కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, కథలోని సహజత్వాన్ని దెబ్బతీయకుండా కేవలం కొన్ని చిన్న మార్పులు, కట్స్తోనే బోర్డు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ‘సలార్’, ‘యానిమల్’ వంటి భారీ యాక్షన్ డ్రామా సినిమాల తరహాలోనే ‘పెద్ది’ చిత్రానికి కూడా భారీ రన్‌టైమ్ లాక్ చేశారు. సినిమా మొత్తం రన్‌టైమ్ 189 నిమిషాలు (3 గంటల 9 నిమిషాలు) గా నిర్ధారించారు.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
అయితే మరి సెన్సార్ బోర్డ్ విధించిన కీలక మార్పులు డైలాగ్ మ్యూట్స్ & బూతులు.. ఏంటీ అంటే ఈ సినిమాలో అక్కడక్కడా పాత్రల మధ్య వచ్చే కొన్ని ఇంటెన్స్ బూతు పదాలను అసభ్యకరమైన డైలాగ్స్‌ను బోర్డ్ మ్యూట్ చేయించింది. సబ్‌టైటిల్స్‌లో కూడా ఆ పదాలను తొలగించబోతున్నారు. మూవీలో ‘చికిరి’ (Chikiri) అనే స్పెషల్ సాంగ్‌లోని “సరుకు సామన్” అనే లూజ్ కామెంట్‌ను మార్చాలని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. అలాగే సినిమాలోని ఒక నిర్దిష్ట సీన్ లో వచ్చే ‘రాజస్తాన్’ అనే పదాన్ని, అలాగే ఒక సామాజిక వర్గానికి లేదా కమ్యూనిటీకి నష్టం కలిగించేలా ఉన్న రిఫరెన్స్‌ను పూర్తిగా తొలగించారు. ఇంకా ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో ఒక క్యారెక్టర్ ‘మిడిల్ ఫింగర్’ (Middle Finger) చూపించే విజువల్‌ను నేరుగా డిస్ప్లే చేయకుండా, దానిపై సీజీ (CG) ఎఫెక్ట్స్‌తో కవర్ చేయాల్సిందిగా బోర్డు ఆదేశించింది. ఈ మార్పులన్నీ కేవలం డైలాగ్స్ చిన్న చిన్న విజువల్స్ వరకే పరిమితం కావడంతో సినిమా అసలు రన్‌టైమ్ అయిన 189 నిమిషాలలో పై ఎలాంటి ఏఫేక్ట్ పడలేదు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!