Pawan Kalyan-Ram Charan : బాబాయ్ ఆఫీసులో అబ్బాయ్.. ఫొటోలు వైరల్

Ram Charan Pawan

Ram Charan Pawan

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో అబ్బాయి రామ్ చరణ్ జరిపిన ఈ ప్రత్యేక సమావేశం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ సెన్సేషన్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్‌ను అక్కడి కార్యాలయలంలో తొలిసారి రామ్ చరణ్ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న చరణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత పరిణామాలు, పలు ఆసక్తికర విషయాలపై కాసేపు ముచ్చటించారు.

రామ్ చరణ్ అమరావతికి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరిలోని ఏసీఏ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళ్లే ముందు.. రామ్ చరణ్ నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను కలవడం విశేషం. బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే చరణ్ క్రికెట్ స్టేడియం వైపు వెళ్ళారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రాగానే లైకులు, షేర్లతో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

×
×
Ad