Pawan Kalyan-Ram Charan : బాబాయ్ ఆఫీసులో అబ్బాయ్.. ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో అబ్బాయి రామ్ చరణ్ జరిపిన ఈ ప్రత్యేక సమావేశం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ సెన్సేషన్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్‌ను అక్కడి కార్యాలయలంలో తొలిసారి రామ్ చరణ్ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న చరణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత పరిణామాలు, పలు ఆసక్తికర విషయాలపై కాసేపు ముచ్చటించారు.
రామ్ చరణ్ అమరావతికి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరిలోని ఏసీఏ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళ్లే ముందు.. రామ్ చరణ్ నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను కలవడం విశేషం. బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే చరణ్ క్రికెట్ స్టేడియం వైపు వెళ్ళారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రాగానే లైకులు, షేర్లతో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!