Dhurandhar 2: ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా లేదు.. పుష్ప రికార్డ్ బ్రేక్, నెక్స్ట్ బాహుబలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ ముగిసినా, వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శించడం విశేషం. సోమవారం ఒక్క రోజే ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో భారతదేశం నుంచే రూ. 519 కోట్ల నెట్, రూ. 619 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 210 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. మొదటి వీకెండ్‌లోనే రూ. 761 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం వారం రోజులు కంప్లీట్ అయ్యేలోపు వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉంది.
Also read: Anil Ravipudi: దూసుకొస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే సెట్స్‌పైకి!
Also Read
ఇదిలా ఉంటే.. ఇండియన్ ఫ్రాంచైజీ చిత్రాల పరంగా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ రెండు భాగాలు కలిపి రూ. 2000 కోట్ల వసూళ్లు సాధించగా, ‘ధురంధర్’ ఫ్రాంచైజీ కేవలం ఐదు రోజుల్లోనే రూ. 2100 కోట్లు రాబట్టింది. దీనితో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా ధురంధర్ అవతరించింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’ క్రేజ్ చూస్తుంటే, త్వరలోనే రెండో స్థానంలో ఉన్న ‘బాహుబలి’ ఫ్రాంచైజీ పేరిట ఉన్న రూ. 2400 కోట్ల రికార్డ్ కూడా బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో YRF స్పై యూనివర్స్ ఫ్రాంజైజీ రూ.3195 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. మొత్తంగా.. లాంగ్ రన్‌లో ధురంధర్ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని, రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లైఫ్ టైం కలెక్షన్స్ పరంగా బాహుబలి 2, పుష్ప 2తో పాటు టాప్ ప్లేస్‌లో ఉన్న దంగల్ రికార్డ్ కూడా బ్రేక్ చేసేలా ఉంది ధురంధర్ 2.
Also read: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవండి!
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!