Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
- ఊహించని ట్విస్ట్‌ను ఎలా రాశావు బుచ్చి
- ఢిల్లీ ఎపిసోడ్ సినిమాకే కీలకం
- లెట్స్ వెయిట్ అండ్ సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Hints at Massive Twist in Peddi: మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక వినూత్నమైన ప్లాన్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబును స్వయంగా తన కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లారు. ఈ డ్రైవ్ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమా షూటింగ్ విశేషాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ సరదా సంభాషణలో భాగంగా పెద్ది గురించి చాలా విషయాలు పంచుకున్నారు. పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పడిన కష్టాలు, బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి ఇద్దరూ చర్చించుకున్నారు.
పెద్ది సినిమాలోని పాత్రల కోసం బుచ్చిబాబు తనను తీవ్రంగా టార్చర్ చేశాడంటూ రామ్ చరణ్ నవ్వుతూ చెప్పారు. క్రికెటర్ బాడీ కావాలని, ఆ తర్వాత కొద్ది రోజులకే పవర్ఫుల్ రెజ్లర్ బాడీ కావాలని.. బుచ్చిబాబు తనను డిమాండ్ చేశాడని చరణ్ వివరించారు. సినిమా టైమ్‌లైన్ తక్కువగా ఉన్నప్పటికీ.. కథపై ఉన్న ప్రేమతో బుచ్చిబాబు అడిగిన ప్రతి లుక్‌ను తీసుకురావడానికి తాను ఎంతో శ్రమించానని చరణ్ వెల్లడించారు. అయితే ఈ డ్రైవ్‌లో చరణ్, బుచ్చిబాబు ఒక విషయాన్ని మాత్రం కాస్త గట్టిగానే చెప్పారు. అదే సినిమా హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది.
Also Read
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
- Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
- Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: 'ప్యారడైజ్' ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
పెద్ది చిత్రంలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే చాలా కీలకం. బుచ్చిబాబు గత చిత్రం ‘ఉప్పెన’ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగా షాక్‌కు గురిచేసిందో.. పెద్దిలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్ దాని కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఇంతటి అద్భుతమైన, ఊహించని ట్విస్ట్‌ను ఎలా రాశావు బుచ్చి? అంటూ చరణ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ లెక్కన సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి చరణ్ చెబుతున్న ఆ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే.. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!