మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ‘మగధీర, రంగస్థలం’ వంటి పలు వైవిధ్యమైన చిత్రాల్లో నట విశ్వరూపం కనబరిచాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్ ను క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Read Also : హీరోయిన్లతో కలిసి సినిమాను వీక్షించిన అక్షయ్…!
తాజాగా చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూడడం కోసం చేసిన పని చర్చనీయాంశంగా మారింది. సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే యువకులు చరణ్ డై హార్డ్ ఫ్యాన్స్. అయితే తాజాగా వీరు ముగ్గురూ తమ అభిమాన హీరోను కలవడం కోసం జోగులాంబ గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు దాదాపు 231 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ విషయం తెలుసుకుని, వారి అభిమానానికి ఫిదా అయిన చరణ్ వారికి హగ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు వారితో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.