Site icon NTV Telugu

Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!

Chikiri

Chikiri

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్‌లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్‌స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా దాటి, ప్రపంచంలోని ప్రతి మూల నుండి శ్రోతలను అలరించాయి. అన్ని భాషల్లో ఈ సాంగ్ కలిసి ఏకంగా 100+ మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి, ఒక గొప్ప విజయాన్ని సాధించింది.

Also Read :iBomma Case: నాలుగు గంటలుగా ఐబొమ్మ రవిని ప్రశ్నిస్తున్న సీపీ సజ్జనార్‌ !

ఈ పాన్-ఇండియా విజయంలో తెలుగు వెర్షన్ సాంగ్ ముందంజలో నిలిచింది. తెలుగు వెర్షన్ దాదాపు 64 మిలియన్ వ్యూస్ మరియు 1 మిలియన్‌కు చేరువైన లైకులతో దూసుకుపోతూ, రామ్ చరణ్ అసమానమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. హిందీ వెర్షన్ కూడా 25 మిలియన్ వ్యూస్‌తో బలంగా నిలవగా, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్లు కలిపి మరో 10 మిలియన్ వ్యూస్‌ను యాడ్ చేశాయి. ఈ సంచలనం వెనుక అసలు హైప్‌ను తెచ్చింది రామ్ చరణ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ మరియు మ్యాగ్నెటిక్ ఆరా.

ఈ పాటలో ఆయన రా, రస్టిక్‌గా పవర్‌ఫుల్ గ్రేస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన స్టెప్స్‌ను వేలాది మంది అభిమానులు రీక్రియేట్ చేస్తుండగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘చికిరి ఫెస్టివల్’ కొనసాగుతోంది. హై ఎనర్జీ డాన్స్ రీల్స్ నుంచి స్టైలిష్ ఎడిట్స్, ఫ్యాన్ ట్రిబ్యూట్స్ వరకూ సోషల్ మీడియా టైమ్‌లైన్లు నిండిపోతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’, విడుదలకు ముందే భారీ హైప్‌ను సృష్టించింది. తొలి సింగిల్‌నే గ్లోబల్ చార్ట్‌బస్టర్‌గా మార్చడంతో, సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రాబోయే ఏడాది ‘పెద్ది’ బిగ్గెస్ట్ గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version