Site icon NTV Telugu

Ram Charan: పేరెంట్ గా ఆలోచిస్తే భయమేస్తోంది.. డ్రగ్స్ పై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు

Ram Charan

Ram Charan

హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వేడుకకు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి, ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో చాలా పాల్గొనేవాడిని. ఇప్పుడు కూడా అవేర్‌నెస్ ప్రొగ్రామ్‌లో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది.

Also Read:Manchu Vishnu: పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు తగ్గిన రోజే టికెట్ హైక్ అడుగుతా!

రైజింగ్ తెలంగాణ పేరుతో మాకు ఆహ్వానం ఇచ్చినందుకు థాంక్స్, ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని అన్నారు. స్కూల్‌ పిల్లలు కూడా వాళ్లు కూడా డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు రోజూ వార్తలు చూస్తున్నాం.. ఈ వార్తలు చాలా బాధిస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ బయట గోలి సోదాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్ లలో ఏం కలుపుతున్నారు అనేది కూడా తెలియదు.

Also Read:Nani – Karthi : కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?

ఇప్పుడు నేను ఒక తండ్రిగా చెబుతున్నా.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. డ్రగ్స్‌కు దూరంగా ఉంచండి. జీవితంలో ఏదో సాధించడానికి కృషి చేయాలి. అప్పుడు ఇలాంటి డ్రగ్స్ మీదకి దృష్టి వెళ్లదు. తప్పకుండా డ్రగ్స్‌కు దూరంగా ఉందాం, దీనిపై అందరం ఒక సోల్జర్‌గా పోరాటం చేద్దాం’ అని రామ్ చరణ్ అన్నారు.

Exit mobile version