మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబి28’ వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా విన్పిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. చరణ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసి పెట్టాడట. ఈ వార్త గనుక నిజమైతే మెగా అభిమానులు ఫుల్ ఖుషి. మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించనున్నాడు.