రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది అనే టైటిల్తో రూపొందించబడుతున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు నిర్మాతగా, అభివృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమా పలు కారణాలతో ఆలస్యమైంది. వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సరిగా తిండి కూడా తినకుండా పూర్తిగా సినిమా పనుల్లోనే నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
Also Read:Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?
ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం పాలైనట్లుగా సమాచారం. అయినా సరే, వెనక్కి తగ్గకుండా సినిమా షూటింగ్ సహా ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద బుచ్చిబాబు ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో, రామ్ చరణ్ తేజ బుచ్చిబాబుతో మాట్లాడి ఆయనకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముందు హెల్త్ ముఖ్యమని, తరువాతే సినిమా అని, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరినట్లు సమాచారం. కచ్చితంగా తాను సహకరిస్తానని, హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత అయినా షూటింగ్ చేసుకోవచ్చని రామ్ చరణ్ చెప్పినట్లుగా సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
