Ram Charan : ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్
- కడప దర్గాకు మెగా పవర్ స్టార్ చరణ్
- భారీ ర్యాలీ నిర్వహించిన మెగా ఫ్యాన్స్
- అయ్యప్ప మాలలో దర్గాకు వచ్చిన రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ రెహ్మాన్‌తో ఉన్న అనుబంధం కారణంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చరణ్. ఇది అక్కడి వారికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే, నా కెరీర్లో ఎంతో ముఖ్యమైన మగధీర సినిమా రిలీజ్ ముందు రోజు నేను ఈ దర్గాను సందర్శించుకున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి, మంచి స్టార్ డమ్ తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే ఎ.ఆర్.రెహ్మాన్‌గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. నేను కూడా వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. రామ్ చరణ్ రాకతో కడప వీధులన్నీ ఫాన్స్ తో నిండిపోయాయి. తమ అభిమాన హీరో తమ ఊరు రావడంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్.
Also Read
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!