Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ

Rakul Ramayana

Rakul Ramayana

రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి, ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ లేక, హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్‌గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా, కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్‌ను ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ఆదుకుంటుంది అనుకుంటే, అది అంతంత మాత్రంగానే ఆడింది. కళకళలాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా? వరుసగా ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. హిందీలో ‘దే దే ప్యార్ దే’తో హిట్ కొట్టి, బాలీవుడ్ ఆఫర్స్ వెనకేసుకుందన్న పేరే గానీ, రకుల్‌కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. కంటిన్యూస్ ఫ్లాప్స్, ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడూ జనాలకు టచ్‌లోనే ఉంటుంది రకుల్. చేతిలో సినిమాలు లేక కావల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్‌గా ఫోజులు ఇవ్వడం, లేదంటే ఫిట్‌నెస్ చాటున వయ్యారాలు ఒలకబోస్తూ కనిపిస్తూనే ఉంటుంది.

అయితే హిందీ ‘రామాయణ’లో రకుల్ పేరు ఒక్కసారిగా వినిపిస్తోంది. ‘రామాయణ’లో హైలైట్ అయిన పాత్రల్లో రకుల్‌ది ఒకటి. రాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యష్‌తో పాటు, శూర్పణఖగా రకుల్ పేరు తెచ్చుకుంది. ఇంపార్టెంట్ రోల్‌తో పాటు గ్లామర్‌గా కనిపించి ఆకట్టుకుంది రకుల్. ఫేడ్ అవుట్ అయిన రకుల్ కెరీర్‌ను శూర్పణఖ కాపాడింది. పెళ్లి, పిల్లల తర్వాత కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా గుర్తింపు దక్కలేదు. ‘రామాయణ’లో యష్ భార్యగా, మండోదరిగా నటించినా, రెండు మూడు సీన్స్, ఒక డైలాగ్‌కే పరిమితమైంది. కాజల్ గుర్తింపుకు నోచుకోని పాత్రగా మిగిలిపోయింది. అయితే పార్ట్-2 లో అయినా సీన్స్ ఉన్నాయో, లేదంటే ఒకటి రెండు సీన్స్‌లో స్టాండింగ్ పొజిషన్‌లో కనిపిస్తుందేమో చూడాలి మరి. ‘రామాయణ’ పార్ట్ 1 లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో సినిమా ప్రమోషన్స్‌కు కాజల్ రాలేదు. ‘భారతీయుడు 2’ విషయంలో కాజల్‌కి ఇదే ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. ‘భారతీయుడు 2’లో కనిపించకపోయినా, ‘భారతీయుడు 3’లో ఉంటుందని ఆశగా ఎదురుచూస్తే, పార్ట్ 3 విడుదలకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న బాలకృష్ణ ‘దాదా’లో రోల్ అయినా గుర్తింపు తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.