కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ లో వలస కార్మికుల కోసం వారి సొంత ఊళ్లకు స్పెషల్ గా బస్సులు ఏర్పాటు చేశారు. సెకండ్ వేవ్ లో కరోనా పేషంట్స్ కు జెట్ స్పీడ్ లో మందులు, బెడ్స్, మెడిసిన్, ఆక్సిజన్ సరఫరా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించే పనిలో ఉన్నారాయన. ఇక అంతటితో ఆయన సేవ ఆగలేదు కష్టం అనే మాట ఎక్కడ విన్పిస్తే అక్కడ వెంటనే వాలిపోతున్నారు.
Read Also : `స్టాండప్ రాహుల్`లో శ్రేయారావుగా వర్షబొల్లమ్మ!
తాజాగా ఓ మహారాష్ట్ర దంపతులు తమ కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్నారు. వారి పాపకు కొంతకాలం క్రితం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఆ పసిపాపకు వైద్యం చేయించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రుల దయనీయ పరిస్థితి సోనూసూద్ వరకు వెళ్లడంతో ఆయన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా ఆ పాప హార్ట్ ట్రీట్మెంట్ తరువాత పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరింది. దీంతో సోనూసూద్ తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు సోను అనే పేరును పెట్టుకున్నారు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో “ఆచార్య” చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.