రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.
Also Read : Kollywood : డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్న స్టార్ కిడ్స్
అయితే ఈ సినిమాను జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్ లో మేకర్స్ చెప్పిన డేట్ కే రిలీజ్ చేయనున్నారు. కానీ తమిళ్ లో మాత్రం ఒకరోజు ఆలస్యంగా అంటే జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారట. అందుకు కారణం తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్. విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా వస్తున్న ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్ సినిమాతో పోటీ వద్దనుకుని ఒకరోజు ఆలస్యంగా రాజాసాబ్ తమిళ్ వర్షన్ ను రిలీజ్ చేయబోతున్నారట. అయితే అలాగే తెలుగు స్టేట్స్ లో కూడా ప్రభాస్ సినిమాతో పోటీ ఎందుకు ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కు ట్రిబ్యూట్ గా వస్తున్న జననాయగన్ కు రాజసాబ్ ఒకరోజు అవకాశం ఇస్తాడో లేదో.