టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. ఈ నెలలో అప్డేట్ ఇస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. ఈ విషయమై నవంబర్ వచ్చింది అని రాజామౌళిని ట్యాగ్ చేస్తూ మహేశ్ బాబు ట్వీట్ చేసాడు. దానికి రాజమోళి ఫన్నీ కౌంటర్ ఇవ్వడం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది.
Also Read : SHOCKING COMPLAINT : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ vs నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు
ఇక ఈ సినిమాకు సంబందించి హైదరాబాద్ ఓ ఈవెంట్ లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. నవంబరు 11 లేదా 15న ఈ వేడుక జరిగే ఛాన్స్ వుంది. ఈ ఈవెంట్ లో టైటిల్ రివీల్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి. ఇదిలా ఉండగ ఈ సినిమాకు ఇప్పటికే టైటిల్ ను ఫిక్స్ చేసి లాక్ చేసి ఉంచారు. కొన్నాళ్లుగా ఈ సినిమాకు అనేక టైటిల్స్ వినిపించాయి. అయితే SSMB 29కు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాడు జక్కన్న. ఈ టైటిల్ నే త్వరలో అధికారకంగా ప్రకటించబోతున్నారు. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ కు మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌలి తో పాటు ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ కూడా రాబోతున్నారు. వారణాసి టైటిల్ పోస్టర్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.