Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌కు ఊహించని బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న నీటి ఎద్దడి కారణంగా ఈ చిత్ర నిర్మాణ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నగర శివార్లలో వేసిన భారీ సెట్లో నీటి అడుగున తీయాల్సిన కీలక సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ అభ్యర్థించిన 150 నీటి ట్యాంకర్ల సరఫరాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తిరస్కరించిందని సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. సినిమా షూటింగ్ కోసం భారీగా వాటర్ ట్యాంకర్లు కావాలని చిత్ర నిర్మాణ సంస్థ HMWSSBని కోరిందని, అయితే ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు దానికి అంగీకరించ లేదని టాక్.
నగరంలో ఎండల తీవ్రత పెరగడంతో నీటికి డిమాండ్ భారీగా పెరిగింది. నివాసితులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో, షూటింగ్ వంటి అత్యవసరం కాని పనులకు ఇంత పెద్ద మొత్తంలో నీటిని కేటాయించలేమని అధికారులు స్పష్టం చేశారని సమాచారం. చిత్ర యూనిట్ నీటి ట్యాంకర్ల ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు నో చెప్పడంతో ప్లాన్ చేసిన అండర్ వాటర్ సీక్వెన్స్ షెడ్యూల్ ప్రభావితమైందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సన్నివేశాలు సినిమాలో విజువల్ వండర్‌గా ఉంటాయని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పుడు చిత్ర బృందం నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read
‘వారణాసి’ విశేషాలు ఇవే..
ఇటీవల మెక్సికోలో జరిగిన కామిక్ కాన్ 2026లో వారణాసి సినిమా నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.. గ్రహశకలం ఢీకొనడం వల్ల కలిగే వినాశనాన్ని ఆపడానికి రుద్ర (మహేష్ బాబు) చేసే ప్రపంచ పర్యటన చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా క్రీ.శ. 512 నుంచి 2027 వరకు ఉన్న కాలక్రమాన్ని అన్వేషిస్తుందన్నారు. ఇందులో 20 నిమిషాల పాటు సాగే రామాయణ ఘట్టం హైలైట్‌గా ఉండనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు (రుద్ర), ప్రియాంక చోప్రా (మందకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Casting Couch: ‘మన మధ్య శారీరక సంబంధం ఉండాలి’.. డైరెక్టర్ మాటలకు షాక్ అయిన నటి
-
EVV Cinema: కోర్టు రోషన్’తో ఈవీవీ కుమారుడి సినిమా
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్‌గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
ట్రెండింగ్
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!