The Raja Saab: వచ్చే నెల నుంచి రాజా సాబ్!!
- తదుపరి సినిమాల మీద ప్రభాస్ ఫోకస్
- మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక హారర్ కామెడీ సినిమాలో ప్రభాస్
- వచ్చే నెల నుంచి రాజా సాబ్ షెడ్యూల్ : మారుతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Saab Update by Maruthi: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక హారర్ కామెడీ సినిమాలో నటించాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. తన ఆధ్వర్యంలో నడిచే ఒక మ్యూజిక్ ప్రోగ్రాం ప్రెస్ మీట్ లో మారుతి ఈ మేరకు మీడియాకి లీక్ ఇచ్చాడు.
Game Changer: గేమ్ చేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్
Also Read
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ఈ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ సీక్రెట్ గా షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మారుతి మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతోందని చెప్పుకొచ్చాడు. ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇకమీదట విడుదల చేయబోతుందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కథ గురించి కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ కాస్త ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయితే కానీ అవి నిజమా కాదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
తాజావార్తలు
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!