మళ్ళీ రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. తాజా విచారణలో కోర్టు ఈ వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ మరికొన్ని రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పేలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిభర్త రాజ్ జూలై 19న పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయ్యాడు. జూలై 23న క్రైమ్ బ్రాంచ్ ముంబైలోని అంధేరిలోని రాజ్ కుంద్రా ‘వియాన్ ఇండస్ట్రీస్’ కార్యాలయంపై దాడి చేసి, దాచిన అల్మరాను కనుగొంది. ఇందులో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీ గురించి అనేక పత్రాలు ఉన్నాయి. రాజ్, శిల్పా శెట్టి జుహు బంగ్లాపై కూడా పోలీసులు దాడి చేశారు. శిల్పాను కూడా పోలీసులు ప్రశ్నించారు. “హాట్ షాట్స్” కంటెంట్ గురించి తనకు తెలియదని శిల్పా స్టేట్మెంట్ లో పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Read Also : చిత్ర నిర్మాణంలో దూసుకుపోతున్న నారాయణ దాస్ నారంగ్
Also Read
ఈ వివాదాస్పద కేసులోముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 48 టిబి డేటాను యాక్సెస్ చేయగలిగాము. రాజ్ కుంద్రా సూచనల మేరకు ఈ కేసు దాఖలు చేసిన తర్వాత భారీగా డేటా తొలగించబడింది. అలాగే కుంద్రా అరెస్ట్ తరువాత మరింత డేటా తొలగించబడింది అని పోలీసులు వెల్లడించారు. అడల్ట్ కంటెంట్ మేకింగ్ కేసులో రాజ్ కుంద్రా పాత్రను పరిశీలిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ కాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తులో చేరే అవకాశం ఉంది. రాజ్ మెర్క్యురీ ఇంటర్నేషనల్ కంపెనీ (ఆన్‌లైన్ బెట్టింగ్ మరియు క్యాసినో గేమింగ్) దక్షిణాఫ్రికా బ్యాంక్ ఖాతా మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను పోలీసులు కనుగొన్నందున వారు మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తారు.
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!