NTV Telugu Site icon

Rahasya Abbavaram : మా ఆయన కోసం ఈ మూవీ చూడండి.. అన్నట్టుగానే..

Rahasya

Rahasya

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read : Tollywood : సంక్రాంతిని సీజన్ ను తలపిస్తున్న టాలివుడ్…

సీయీవో రహస్య గోరక్ మాట్లాడుతూ –  కిరణ్ తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి హైస్ అండ్ లోస్ చూస్తూ వస్తున్నారు. తనకు సక్సెస్ రావాలని మీరంతా కోరుకున్నారు. సపోర్ట్ గా నిలిచారు. ఇది మా అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్. మీ బ్లెస్సింగ్స్ తో మా మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ‘క’ సినిమా చూడటానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి మీకోసం చూడండి ఇందులో మీకు కావలసిన ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది, ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్య పరిచే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కచ్చితంగా మీరు పెట్టి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఇంకోటి మా అందరి కోసం చూడండి. ఇష్టంతో చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందని అంటారు. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా ఇష్టంతో కష్టపడి పనిచేశారు.  మరి ముఖ్యంగా మా ఆయన కోసం ఈ మూవీ చూడండి. ఈ చిత్రం కోసం కిరణ్ చాలా  కష్టపడి వర్క్ చేశారు.  అన్నట్టుగానే కిరణ్ అబ్బవరం కోసం ఈ సినిమా చూడొచ్చు. కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని క్రిటిక్స్ పేర్కొన్నాడు.

Show comments